తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విడుదల​కు ముందే సినిమా చూపించారు...! - రెజీనా

'ఎవరు' సినిమాను బాగా తెరకెక్కించేందుకు 70 శాతం షూటింగ్​ జరిగిన తర్వాత కొంత మంది యువతీయువకులకు చూపించామని చెప్పాడు హీరో అడివి శేష్. కథలో మార్పులు చేసేందుకు ఇది చాలా ఉపయోగపడిందన్నాడు

రిలీజ్​కు ముందే సినిమా చూపించారు...!

By

Published : Aug 14, 2019, 8:36 PM IST

Updated : Sep 27, 2019, 12:53 AM IST

వైవిధ్యభరిత కథలకు కేరాఫ్ అడ్రస్​గా మారిన హీరో అడివి శేష్. 'ఎవరు' సినిమాతో థియేటర్లలో గురువారం నుంచి సందడి చేయనున్నాడు. ప్రచారంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. విడుదలకు ముందే సినిమాను కొంత మంది యువతకు చూపించి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పాడు.

ఎవరు సినిమా పోస్టర్​

"ఈ సినిమా 70 శాతం షూటింగ్ కాగానే కొంత మంది యువతీయువకులకు చూపించాం. వారి అభిప్రాయాలకు తగ్గట్లుగా మళ్లీ మార్పులు చేశాం. ఆ తర్వాత మరికొంతమందికి చూపించాం. అనంతరం కొన్ని రీషూట్లు చేశాం. అలా గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 బ్యాచ్‌లుగా వెయ్యి మందికి పైగా సినిమాను చూపించి వాళ్ల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మరీ జాగ్రత్తగా ‘ఎవరు’ను తెరకెక్కించాం. ఇలా తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. హీరో, డైరెక్టర్​ల ముందు సినిమా చూపించి ఎలా ఉంది అంటే? బాగుంది అనేసి వెళ్లిపోతారు. కానీ వాళ్ల మనసులోని నిజాన్ని తెలుసుకోవాలంటే హీరో కానీ, దర్శకుడు కానీ ఎవరు వాళ్ల దగ్గరలో ఉండకూడదు. అందుకే ‘ఎవరు’ చిత్రబృందంలోని ఒక తెలియని వ్యక్తిని థియేటర్లో ఉండమని చెప్పి, ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. అలా అనేక సార్లు కథలో మార్పులు చేర్పులు చేసుకున్నాం" - అడివి శేష్, నటుడు

ఈ సినిమాలో రెజీనా హీరోయిన్​గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ్​జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పీవీపీ బ్యానర్​పై ప్రసాద్ పొట్లూరి నిర్మించారు.

ఇది చదవండి: ప్రఖ్యాత అత్తివరదరాజస్వామి సేవలో రజనీకాంత్

Last Updated : Sep 27, 2019, 12:53 AM IST

ABOUT THE AUTHOR

...view details