తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్రమ్ వాసుదేవ్.. అవినీతి పోలీస్ అధికారి

అడివి శేష్​ హీరోగా నటిస్తున్న 'ఎవరు' ప్రీలుక్ విడుదలైంది. ఇందులో అవినీతి పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు ఈ కథానాయకుడు.

విక్రమ్ వాసుదేవ్.. అవినీతి పోలీస్ అధికారి

By

Published : Jul 9, 2019, 9:44 PM IST

టాలీవుడ్​లో ప్రతిభావంతమైన నటుల్లో అడివి శేష్ ఒకడు. ఇతర పాత్రలు చేస్తూనే హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఓ బేబీ సినిమాలో తళుక్కున మెరిశాడు. ఇప్పుడు అవినీతి పోలీస్ 'విక్రమ్ వాసుదేవ్'​​గా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 'ఎవరు' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని హీరో ప్రీలుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఫస్ట్​లుక్​ను 11వ తేదీన తేనున్నారు.

విక్రమ్ వాసుదేవ్​గా హీరో అడివి శేష్

ఈ సినిమాలో రెజీనా హీరోయిన్​గా నటిస్తోంది. వెంకట్ రాంజీ దర్శకుడు. నవీన్‌ చంద్ర, మురళీ శర్మ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పీవీపీ బ్యానర్​పై ప్రసాద్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, కెవిన్‌ అన్నె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. 'మిషన్‌ మంగళ్‌'

ABOUT THE AUTHOR

...view details