తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్కడా అదరగొడుతున్న శేష్ 'ఎవరు'

అడివి శేష్, రెజీనా, నవీన్​ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎవరు' ఇటీవల విడుదలై బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం అమెజాన్​ ప్రైమ్​లో ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం అక్కడా వీక్షకులను కట్టిపడేస్తోంది.

ఎవరు చిత్రంలో అడివి శేషు

By

Published : Sep 16, 2019, 1:13 PM IST

Updated : Sep 30, 2019, 7:46 PM IST

క్రైమ్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన టాలీవుడ్ నటులు అల్లు అర్జున్​, మహేశ్​ బాబు అద్భుతంగా ఉందంటూ అభినందించారు. అయితే, ప్రస్తుతం అమెజాన్​ ప్రైమ్​​లో ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం.. అక్కడా ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా చూసిన వారంతా ఊహించని మలుపులతో అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెంకట్​ రామ్​జీ 'ఎవరు'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవీన్​ చంద్ర కీలక పాత్రలో కనిపించాడు. పీవీపీ బ్యానర్​లో ప్రసాద్​ పొట్లూరి నిర్మాతగా వ్యవహరించాడు.

ఇదీ చూడండి: నేను కోలుకున్నా.. మీరు జాగ్రత్త: నాగ్

Last Updated : Sep 30, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details