తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికర కార్యక్రమం సిద్ధమైంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌కు యువ కథానాయకుడు రామ్‌చరణ్ విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ''ఈనెల 22న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్ రైజర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ప్రశ్న.. రామ్‌చరణ్ ఫన్నీ ఆన్సర్ - SS RAJAMOULI
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం తొలి ఎపిసోడ్‌కు అతిథిగా విచ్చేశారు రామ్‌చరణ్. ఈ ఇద్దరు రామ్‌ల మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఆగస్టు 22న ఇది ప్రసారం కానుంది.
ఇక షోలోకి చెర్రీ ఎంట్రీ ఇచ్చి, హోస్ట్‌సీట్‌లో కూర్చోబోయారు. వెంటనే అడ్డుపడిన ఎన్టీఆర్.. అది హాట్ సీటు.. ఇది హోస్ట్ సీటు అని చెప్పడం వల్ల చరణ్ వెళ్లి హాట్ సీటులో కూర్చొన్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చివరకు ఎన్టీఆర్ వేసిన ప్రశ్న విన్న తర్వాత 'సీటు హీట్ ఎక్కుతోంది.. బ్రెయిన్ హీట్ ఎక్కుతోంది' అంటూ చరణ్ సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరించేలా ఉంటుందని అర్థమవుతోంది. పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 22న రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ఆసక్తికర ప్రోమో చూసేయండి. అన్నట్లు వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి:Kargil War: మాధురీ దీక్షిత్‌ను ఇచ్చేయమన్న పాక్..!