ఎన్టీఆర్(meelo evaru koteeswarudu ntr episode) వ్యాఖ్యాతగా అలరిస్తున్న కార్యక్రమం 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu). పండగల వేళ ప్రత్యేక అతిథులతో అలరిస్తున్న ఈ షోలోకి ఈసారి సంగీత దర్శకులు తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లు వచ్చారు(meelo evaru koteeswarudu latest promo).
అతిథులుగా తమన్, దేవిశ్రీ.. ఎన్టీఆర్ పంచ్‌లే పంచ్‌లు! - devi sri pradad
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా అలరిస్తున్న కార్యక్రమం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు ఈ సారి సంగీత దర్శకులు తమన్, దేవీశ్రీ ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. వారికి తారక్ మధ్య సంభాషణలు సరదా సరదాగా సాగాయి. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అప్పటివరకు దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
ఎన్టీఆర్
'మీలో తుంబురుడు, నారదుడు ఎవరు' అని ఎన్టీఆర్ వారిద్దరినీ ప్రశ్నించారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' పాటను తనదైన శైలిలో పాడి దేవిశ్రీ అలరించగా, అందుకు ఎన్టీఆర్ కోరస్ పాడారు. ఇక 'పంచ్ కోసం పంచ్ ఇచ్చి ప్రాణాలు తీసేస్తా.. కాన్ఫిడెంట్' అని ఎన్టీఆర్ అంటే, 'ఓవర్ కాన్ఫిడెంట్' అంటూ తమన్ చెప్పడం వల్ల నవ్వులు పూశాయి. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇదీ చూడండి: ఎన్టీఆర్‌తో సమంత ఎందుకలా అంది!