ఈటీవీలో దీపావళికి 'తగ్గేదే లే' అనే ప్రత్యేక ప్రోగ్రాం ప్రసారం కానుంది. దీని కొత్త ప్రోమో.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. పలు విశేషాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. దీంతో ఎపిసోడ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
'కన్నులతో చూసేటి..' పాటకు డ్యాన్స్ చేసిన ఇంద్రజ.. తన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇంద్రజ, ప్రియమణి, రోహిణి, హైపర్ ఆది, చంటి, రాంప్రసాద్ పోటీపోటీగా పాటలు పాడి అలరించారు.