తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనోజ్​పై కోపంగా ఉన్న విష్ణు.. ఎందుకంటే? - ఆలీ సరదాగా డైరెక్టర్ ఎవరు?

భారతదేశం గర్వించదగ్గ నటుల్లో తన తండ్రి మోహన్‌ బాబు ఒకరని టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అన్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఆయన.. త్వరలో జరగనున్న 'మా' ఎన్నికలు సహా.. పలు అంశాలపై మాట్లాడారు.

ఆలీతో సరదాగా
ఆలీతో సరదాగా

By

Published : Aug 17, 2021, 4:30 PM IST

"మంచి దర్శకులని ఎంపిక చేసుకోకపోవడమే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు" అని మంచు విష్ణు తెలిపారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ మాట అన్నారు. ఆగస్టు 23న ప్రసారం కానున్న ఈ కార్యక్రమ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత, సినిమా విషయాలు పంచుకుంటూ సందడి చేశారు విష్ణు. 'మంచు విష్ణు.. బాబు?' అని ఆలీ అనగా 'బాబోయ్‌.. మీరు కూడానా' అంటూ ప్రారంభంలోనే నవ్వులు పూయించారు. భారతదేశంలోని లెజెండరీ నటుల్లో తన తండ్రి మోహన్‌ బాబు ఒకరని, ఆయన తనయుడిగా ఒకట్రెండు సినిమాలకు అవకాశాలు రావొచ్చని, దాని తర్వాత టాలెంట్‌ ఉంటేనే కెరియర్‌ ఉంటుందని తెలిపారు. టాలెంట్‌ ఉంది కాబట్టే ఈ షోలో ఉన్నానన్నారు.

అక్క లక్ష్మి అంటే నాన్నకు ఎందుకంత ప్రేమో.. తనకి అమ్మాయిలు పుట్టినప్పుడు అర్థమైందని చెప్పారు. 'అందుకే పోటీపడి నలుగురిని కన్నావా' అని ఆలీ కామెడీ పంచారు. తన ప్రేమ, భార్య గురించి కొన్ని సంగతులు పంచుకున్నారు. ఇంకా పిల్లల్ని కందామా? అని అడిగితే తన భార్య 'ఇంకెవరినైనా చూస్కో' అంది అని సమాధానమిచ్చారట. తర్వాత సినిమాల గురించి చెప్తూ.. మూర్ఖత్వం, సెంటిమెంట్‌.. తదితర కారణాలతో మంచి దర్శకులను ఎంపిక చేసుకోలేకపోయానన్నారు.

మీ తమ్ముడు, నటుడు మనోజ్‌ మీద మీరు చాలా కోపంగా ఉంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? అని ఆలీ అంటే ప్రశ్నించగా 'ఎందుకు చెప్పాలి వాళ్లకి సమాధానం' అంటూ విష్ణు సీరియస్‌గా లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. మోహన్‌బాబుని చూడగానే లేవడం, చేతులు కట్టుకోవడం మనసులోంచి వచ్చిందా, నటనా? అని మరో ప్రశ్నగా ఆలీ అడిగిన దానికి విష్ణు ఏం సమాధానం చెప్పారు? 'మా' ఎన్నికల గురించి ఏం మాట్లాడారు? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details