తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సలార్​'లో ప్రభాస్​ తల్లిగా సీనియర్​ నటి! - ఈశ్వరీ రావు వార్తలు

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​-దర్శకుడు ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో రూపొందతోన్న చిత్రం 'సలార్​'. ఇందులో ఓ కీలకపాత్ర కోసం సీనియర్ నటి ఈశ్వరీరావును చిత్రబృందం సంప్రదించిదట. అందుకు ఆమె అంగీకరించిందని సమాచారం. 'సలార్'​లో ప్రభాస్​ తల్లి పాత్రలో ఆమె నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

eswari rao to be playing prabhas mother role in Salaar
'సలార్​'లో ప్రభాస్​ తల్లిగా సీనియర్​ నటి!

By

Published : Mar 16, 2021, 1:30 PM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కథానాయికగా, సహాయనటిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఓ ప్రముఖ నటి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నటి అంటే.. ఈశ్వరీరావు.

'ఇంటింటా దీపావళి'తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈశ్వరీరావు ప్రస్తుతం అమ్మ, వదిన, అత్త.. ఇలా విభిన్న పాత్రల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 'అ..ఆ..', 'కాలా', 'నేను లోకల్‌', 'అరవింద సమేత', 'కేజీయఫ్‌' చిత్రాలతో మెప్పించిన ఈశ్వరీరావు త్వరలోనే ప్రభాస్‌ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆమె ప్రభాస్‌ తల్లిగా కనిపించనున్నారట.

ఈశ్వరీరావు

ఈ మేరకు ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ఈశ్వరీరావుని సంప్రదించగా.. ఆమె కూడా ఇందులో నటించేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరోవైపు, ఈశ్వరీరావు చేతిలో ప్రస్తుతం 'లవ్‌స్టోరీ', 'విరాటపర్వం', 'ఖాకీ', 'కేజీయఫ్‌-2' ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'సలార్‌' వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

ఇదీ చూడండి:యాడ్​షూట్​లో సూపర్​స్టార్​.. 'ది బిగ్​బుల్​' టీజర్​

ABOUT THE AUTHOR

...view details