సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'మహర్షి'. 19 రోజుల్లోనే ఈ సినిమా రూ.175 కోట్లు వసూలు చేసి... రూ.200 కోట్లకు పరుగులు తీస్తోంది. వైజయంతి మూవీస్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై... బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
రూ.175కోట్లు దాటిన మహేశ్ 'మహర్షి' - cinema
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం 19 రోజుల్లోనే రూ.175 కోట్ల మార్కును దాటేసింది. ఈ విషయాన్ని ఎస్వీసీ సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు అద్భుత నటన, వంశీ పైడిపల్లి దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా భారీ నిర్మాణ విలువలు మహర్షి చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా విడుదల అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్ మహేశ్ గత కలెక్షన్ రికార్డులను క్రాస్ చేసి రూ.175 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఎస్వీసీ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇవీ చూడండి.. మలైకాను ఇబ్బంది పెట్టిన సెల్ఫీ రాయుళ్లు