తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్యాణ్​రామ్ ఎంతమంచివాడవురా రీమేకేనా..! - kalyan ram

కల్యాణ్​రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఎంతమంచివాడవురా. గుజరాతీ హిట్‌ చిత్రం ఆక్సిజన్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు సతీశ్ వేగేశ్న. అయితే ఈ విషయాన్ని బహిర్గత పరచలేదు చిత్రబృందం.

enthamanchi vadavura movie is remake of gujarathi film
ఎంతమంచివాడవురా

By

Published : Nov 28, 2019, 9:44 PM IST

ప్రస్తుతం టాలీవుడ్​లో రీమేక్‌ చిత్రాల హవా నడుస్తోంది. ఈ ఏడాది హిట్టయిన ఎక్కవ శాతం సినిమాలు అరువు తెచ్చుకున్న కథలే కావడం విశేషం. వీటిలో ‘వాల్మీకి’, ‘రాక్షసుడు’, ‘ఎవరు’ లాంటివి ముఖ్యమైనవి. అయితే అన్ని సందర్భాల్లో తమది రీమేక్‌ చిత్రమని ఒప్పుకోవడానికి చిత్ర దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు. కల్యాణ్​రామ్​ నటించిన ఎంతమంచివాడవురా కూడా రీమేకేనట.

గుజరాతీ హిట్‌ చిత్రం ఆక్సిజన్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటపడనివ్వలేదు చిత్ర బృందం. మాతృకలోని ఆత్మను మాత్రమే తీసుకోని ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పూర్తిగా మార్చి రాసుకున్నారట దర్శకుడు సతీష్‌ వేగేశ్న. అందుకే బహిర్గతపరచలేదని సమాచారం.

ఓ సరికొత్త ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం.

ఇదీ చదవండి: కేజీఎఫ్​2 ఇందిరా పాత్రలో రవీనా టాండన్..!

ABOUT THE AUTHOR

...view details