ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా'కు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సతీశ్ వేగేశ్న దర్శకుడు. మెహరీన్ కథానాయికా. గోపి సుందర్ సంగీతం అందించాడు. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.