తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​ను​​ వెంటపడి ఐలవ్యూ అడిగిందెవరు..? - కల్యాణ్​రామ్​ను​ వెంటపడి ఐలవ్యూ అడుగుతోంది ఎవరు..?

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఇందులో మెహరీన్​ కథానాయిక. సతీశ్‌ వేగేష్న దర్శకుడు. నేడు ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Entha Manchivaadavuraa Theatrical Trailer, Kalyan Ram And Mehreen played lead role
కల్యాణ్​రామ్​ను​ వెంటపడి ఐలవ్యూ అడుగుతోంది ఎవరు..?

By

Published : Jan 8, 2020, 8:30 PM IST

Updated : Jan 8, 2020, 8:38 PM IST

టాలీవుడ్​ ప్రముఖ హీరో కల్యాణ్​రామ్ నటించిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి ఫేం సతీష్ వేగేష్న దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్​ విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్​ ముఖ్య అతిథిగా...

ఈ రోజు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో.. ప్రీ రిలీజ్​ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి యంగ్​టైగర్​ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజర్యయాడు.

కల్యాణ్​ కెరీర్​లో ఇది 17వ సినిమా. మెహరీన్​ కథానాయికగా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఉమేశ్ గుప్తా, సుభాశ్ గుప్తాలు సంయుక్తంగా నిర్మించారు. వి.కె న‌రేశ్‌, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు సినిమాలో నటించారు.

Last Updated : Jan 8, 2020, 8:38 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details