తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ కల ఈ సినిమాతో నెరవేరుతోంది: జూ.ఎన్టీఆర్​ - ntr news

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా ప్రీ రిలీజ్​ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కథానాయకుడు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. వేదికపై ట్రైలర్‌ను విడుదల చేసిన యంగ్​టైగర్​.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

Entha Manchivaadavuraa: Jr NTR as chief guest at the pre-release event and talk about Nandamuri Kalyanram role
ఆ కల ఈ సినిమాతో నెరవేరుతోంది: జూ.ఎన్టీఆర్​

By

Published : Jan 8, 2020, 11:05 PM IST

హైదారాబాద్​ వేదికగా జరిగిన 'ఎంత మంచివాడవురా' సినిమా ప్రీ రిలీజ్​ వేడుకకు జూ.ఎన్టీఆర్​ హాజరయ్యాడు. వేదికపై ట్రైలర్​ను ఆవిష్కరించిన యంగ్​టైగర్​... కల్యాణ్​రామ్​ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్నయ్య సినిమాల విషయంలో ఎక్కడో ఉన్న చిన్న వెలితి ఈ సినిమాతో తీరిందని అన్నాడు.

"అన్నయ్య కల్యాణ్‌రామ్‌ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. అయినా నాకు ఎక్కడో వెలితి ఉండేది. కుటుంబ కథా చిత్రంలో కల్యాణ్‌ అన్నను చూడాలనేది నా కల. ఆ కల వేగేశ్న సతీశ్‌ దర్శకత్వంలో నెరవేరుతోంది. కృష్ణప్రసాద్‌గారు నిర్మాత కాదు.. మా కుటుంబ సభ్యుడు. ఆయన సమర్పణలో, ఆదిత్య మ్యూజిక్‌ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం మీ ముందుకొస్తోంది. మంచి సినిమాలను ఆదరించే గుణం మీకు ఉంది. ఈ చిత్రానికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను. ఈ పండక్కి వస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో.., ఎంత మంచివాడవురా సినిమాలూ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. తెలుగు చిత్రసీమ మరింత ముందుకెళ్లాలి".

-- జూనియర్​ ఎన్టీఆర్​, సినీ నటుడు

నందమూరి కల్యాణ్‌రామ్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. సతీశ్‌ వేగేశ్న దర్శకుడు. గోపీసుందర్‌ సంగీతం అందించాడు. ఆదిత్య మ్యూజిక్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పకులు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details