తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి ఒకే వేదికపై నందమూరి హీరోలు - సతీశ్​ వేగ్నేశ్న

నందమూరి బాలకృష్ణ, జూనియర్​ ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​.. మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. కల్యాణ్​రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో ఈ ముగ్గురు సందడి చేయనున్నారని టాక్.

Entha manchi vaadavura movie pre release event on january 8,2020
నందమూరి హీరోలు.. మరోసారి ఒకే వేదికపై

By

Published : Dec 30, 2019, 5:56 PM IST

Updated : Dec 30, 2019, 6:44 PM IST

నందమూరి హీరోలు.. బాలకృష్ణ, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ మళ్లీ కలవబోతున్నారా? ఒకే వేదికపై కలిసి సందడి చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. కల్యాణ్​రామ్​ నటించిన 'ఎంత మంచివాడవురా' ముందస్తు విడుదల వేడుక.. జనవరి 8న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరుడు ఎన్టీఆర్‌తో పాటు బాబాయ్‌ బాలకృష్ణను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, ఈ ముగ్గురు నందమూరి కథానాయకులు.. ఒకే వేదికపై సందడి చేయడమిది ముచ్చటగా మూడోసారి కానుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఎంత మంచివాడవురా చిత్రంలో కల్యాణ్​రామ్​

ఈ ముగ్గురు హీరోలు గతంలో 'అరవింద సమేత', 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' వేడుకల్లో ఒకే వేదికపై దర్శనమిచ్చారు.

కల్యాణ్ రామ్​-సతీశ్ వేగేశ్న కాంబినేషన్​లో 'ఎంత మంచివాడవురా' రూపొందింది. మెహరీన్‌ హీరోయిన్. గోపీసుందర్​ సంగీతమందించాడు. ఉమేశ్ గుప్తా, సుభాశ్ గుప్తాలు సంయుక్తంగా నిర్మించారు. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:- నేచురల్​ స్టార్​ నానితో రౌడీ హీరో మరోసారి!

Last Updated : Dec 30, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details