తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2వేల కోట్ల మార్కును దాటిన అవెంజర్స్​ - ఎండ్​గేమ్

మార్వెల్​ స్టూడియోస్​ నిర్మించిన 'అవెంజర్స్​: ఎండ్​గేమ్​' ప్రపంచ బాక్సాఫీసు వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఇప్పటికే రూ. 2వేల కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

21వేల కోట్ల మార్కును దాటిన అవెంజర్స్​

By

Published : Apr 27, 2019, 6:24 PM IST

సూపర్​​హీరోస్​ చిత్రం 'అవెంజర్స్​: ఎండ్​గేమ్'​ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 305 మిలియన్‌ డాలర్ల (రూ.2వేల కోట్లు) మార్కు దాటేసింది.

చైనాలో విడుదలైన తొలి రోజే వసూళ్లలో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం ఏకంగా 107 మిలియన్‌ డాలర్లు సాధించినట్లు ట్రేడ్‌ విశ్లేషకుడు గిరీష్‌ జోహార్‌ వెల్లడించారు.

భారత్​లో ఆంగ్లం,తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైందీ ఈ సినిమా. తొలిరోజే రూ. 53కోట్ల పైగా కలెక్షన్లు సాధించింది. ‘అవెంజర్స్’ సిరీస్‌ నుంచి వచ్చిన ఆఖరి చిత్రం కావడం వల్ల చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా ఉద్వేగానికి లోనవుతున్నారు.

ఇంతకు ముందు ఈ సిరీస్​లో వచ్చిన 21 సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా ఎండ్​గేమ్ సినిమాతో 11 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికారు దర్శకులు. ఈ చిత్ర నిడివి 3గంటల ఒక నిమిషం ఉంది. ఇప్పటివరకూ మార్వెల్‌ స్టూడియోస్‌లో నుంచి వచ్చిన సినిమాల్లో అత్యధిక నిడివి గల చిత్రమిదే. ఈ మూవీకి ఆంటోని రుస్సో, జో రుస్సో దర్శకులు. సినీ చరిత్రలో అతిపెద్ద సినిమాగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఇవాన్స్‌, స్కార్లెట్‌ జొహాన్సన్‌, టామ్‌ హొలాండ్‌, విన్‌ డీసిల్‌, క్రిస్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details