తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎజ్రా' చిత్రంతో భయపెట్టనున్న ఇమ్రాన్ హష్మీ - movie

మలయాళ చిత్రం 'ఎజ్రా'ను రీమేక్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. అదే పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. మాతృకను తెరకెక్కించిన జై కృష్ణనే ఈ సినిమానూ రూపొందిస్తున్నాడు.

ఇమ్రాన్

By

Published : Jul 18, 2019, 3:17 PM IST

ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఎజ్రా.' ఈ సినిమా షూటింగ్ మారిషస్​లో నేడు ప్రారంభమైంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జై కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్రాన్ని నిర్మిస్తున్న టీ - సిరీస్ సంస్థ తన ట్విట్టర్లో పంచుకుంది.

2017లో మలయాళ హీరో పృథ్వీకుమార్ నటించిన ఎజ్రా చిత్రాన్ని అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రాన్నీ జై కృష్ణనే తెరకెక్కించాడు. సీరియల్ కిస్సర్​గా పేరున్న ఇమ్రాన్ హష్మీ ఈ హర్రర్​ చిత్రంతో ప్రక్షకులను భయపెట్టనున్నాడు.

పనోరమ స్టూడియోస్ ప్రొడక్షన్​లో కుమార్ మంగత్,భూషణ్​కుమార్ తదితరులు నిర్మిస్తున్నారు. ఆదిత్య చోక్సీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇది చదవండి: 'నా యాక్టింగ్ కొంచెం హారర్​గా ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details