ప్రముఖ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డు వేడుక (72వ) లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగింది. కరోనా కారణంగా ఈసారి వర్చువల్గా ఈ వేడుకను నిర్వహించారు. ఆర్టిస్టులు వారి ఇంటివద్ద నుంచే పురస్కారాలు అందుకున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలు ఈ వేడుకలో సత్తాచాటాయి. 24 ఏళ్ల జెండేయా ఉత్తమ నటిగా నిలిచి అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న నటిగా చరిత్ర సృష్టించింది.
72వ ఎమ్మీ అవార్డు వేడుకలో జెండేయా రికార్డు - 72వ ఎమ్మీ అవార్డు వేడుక
72వ ఎమ్మీ అవార్డు ప్రదానోత్సవ వేడుక కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్గా జరిగింది. నటులు పురస్కారాలను ఇంటివద్ద నుంచే అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటిగా నిలిచిన జెండేయా ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది.
జెండేయా
ఈ వేడుకలు లాస్ ఏంజెలిస్లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈసారి వర్చువల్గా నిర్వహించారు. అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఎమ్మీ అవార్డు విజేతలు
- ఉత్తమ నటుడు ( లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) - మార్క్ రఫాలో (ఐ నో దిస్ మచ్ ఈజ్ ట్రూ)
- ఉత్తమ నటి ( లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) - రెజీనా కింగ్ (వాచ్మన్)
- ఉత్తమ సహాయ నటుడు (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) - యాహ్యా అబ్దుల్ మటీన్ (వాచ్మన్)
- ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ సినిమా) - ఉజో అడుబా (మిసెస్ అమెరికా)
- ఉత్తమ నటుడు (కామెడీ సిరీస్ )- యూజీన్ లెవీ (షిట్స్ క్రీక్)
- ఉత్తమ నటి (కామెడీ సిరీస్) - కేథరీన్ ఓహరా (షిట్స్ క్రీక్)
- ఉత్తమ సహాయ నటుడు (కామెడీ సిరీస్) - డ్యాన్ లెవీ (షిట్స్ క్రీక్)
- ఉత్తమ సహాయ నటి (కామెడీ సిరీస్) - అన్నీ మర్ఫీ (షిట్స్ క్రీక్)
- ఉత్తమ నటుడు (డ్రామా సిరీస్) - జెరెమీ స్ట్రాంగ్ (సక్సెషన్)
- ఉత్తమ నటి (డ్రామా సిరీస్) - జెండేయా (యుఫోరియా)
- ఉత్తమ సహాయ నటుడు (డ్రామా సిరీస్) - బిల్లీ క్రుడుప్ (ద మార్నింగ్ షో)
- ఉత్తమ సహాయ నటి (డ్రామా సిరీస్) - జూలియా గార్నర్ (ఒజార్క్)
- ఉత్తమ సిరీస్ (రియాలిటీ/కాంపిటీషన్)- రు పాల్స్ డ్రాగ్ రేస్
- ఉత్తమ సిరీస్ (వెరైటీ టాక్ సిరీస్) - లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఒలివర్
- ఉత్తమ సిరీస్ (లిమిటెడ్) - వాచ్మన్
- ఉత్తమ సిరీస్ (కామెడీ) - షిట్స్ క్రీక్
- ఉత్తమ సిరీస్ (డ్రామా) - సక్సెషన్
Last Updated : Sep 21, 2020, 11:29 AM IST