తెలుగు చిత్రసీమ ప్రముఖ దర్శక దిగ్గజాలకు పెట్టింది పేరు. అయితే.. ఈ చిత్రసీమలో మహిళా దర్శకులు ఎంత మంది అంటే మాత్రం వెళ్లమీద లెక్కపెట్టి చెప్పే పరిస్థితి. పదేళ్లకోసారి ఓ లేడీ డైరెక్టర్ పేరు వినిపించేది. కానీ, ఈసారి ట్రెండ్ మారింది. ఇటీవలి కాలంలో విడుదలైన 'వరుడు కావలెను', 'పెళ్లిసందD', 'ఆకాశం నీ హద్దురా', 'ఓ బేబీ' వంటి చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో సత్తాచాటుతున్నారు లేడీ డైరెక్టర్లు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో వారు వేసిన తొలి అడుగుతోనే సత్తా చాటిన మేటి లేడీ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం..
1. లక్ష్మీ సౌజన్య
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను'(Varudu Kaavalenu Director) చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది లక్ష్మీ సౌజన్య. ఈమె పుట్టింది కర్నూల్ జిల్లా వెంకటాపురం గ్రామంలో అయినప్పటికీ పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావుపేటలోనే. సినిమాలపై ఉన్న ఆసక్తితో 18 ఏళ్లకే హైదరాబాద్ వచ్చింది సౌజన్య. ఆరంభంలో డైరెక్టర్ తేజ వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసే అవకాశం దక్కించుకుంది.
శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్ ఇలా చాలా మంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసింది లక్ష్మీ సౌజన్య(Lakshmi Sowjanya Director Movies List). 2013లో విడుదలైన 'అలజడి' చిత్రానికి నిర్మాతగానూ పనిచేసింది. ఆమె దర్శకత్వం వహించిన 'వరుడు కావలెను' చిత్రం అక్టోబర్ 29న విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది.
2. గౌరి రోణంకి
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లిసందD'(Pelli Sandadi Director) చిత్రాన్ని రూపొందించారు. కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్, యువనటి శ్రీలీల జంటగా నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు చిత్రసీమలో దర్శకురాలిగా అడుగుపెట్టింది గౌరి రోణంకి(Gowri Ronanki Movies). రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తొలి చిత్రాన్ని రూపొందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు రోణంకి ఓ సందర్భంలో తెలిపింది. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 15న విడుదలైన 'పెళ్లిసందD' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
3. సుధా కొంగర