బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. ప్రముఖ హెయిర్ ఆయిల్ నవరత్నకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని ఇమామీ కంపెనీ ధ్రువీకరించింది. ఈ వారం నుంచే సంబంధిత ప్రకటనలు వస్తాయని తెలిపింది.
ఇప్పటికే బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, గోవింద, హీరోయిన్ శిల్పాశెట్టితో పాటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్లుగా వ్యవహరించారు.