కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడిన 'ఏక్ మినీ కథ' చిత్రం ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. కొవిడ్ కారణంగా థియేటర్లు మూసివేయడం వల్ల తమ సినిమాను డిజిటల్ వేదికగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మే 27న అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ సినిమా ఓటీటీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేయనున్నారు. తొలుత ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమైన.. దేశంలో కరోనా రెండోదశ కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు.