తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్ని పాటలో తెలుసా..? - ramcharan, ntr

జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఆర్​ఆర్ఆర్'. ఈ సినిమాకు సంబంధించిన వార్తకొటి సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్.

ఆర్ఆర్ఆర్

By

Published : Nov 8, 2019, 11:25 AM IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్​స్టార్ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్​ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త బయటకు వస్తుందా అని.. చిత్రసీమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాంటి వార్తే ఒకటి చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఎనిమిది పాటలు ఉంటాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, మరికొన్ని ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన మూడు పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌ తేజ రాశాడని సమాచారం. విప్లవ, ప్రేమ గీతాలు రాయడం సుద్దాలకు వెన్నతో పెట్టిన విద్య.

ఈ సినిమాలో బాలీవుడ్‌ కథానాయిక ఆలియా భట్‌.. రామ్‌చరణ్‌ సరసన కనిపించనుంది. సముద్రఖని, అజయ్‌ దేవగణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. జులై 30, 2020న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ.

ఇవీ చూడండి.. అదరగొడుతున్న కమల్ సేనాపతి గెటప్​

ABOUT THE AUTHOR

...view details