తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బైక్‌ రైడ్‌తో ఫిదా చేస్తోన్న ఈషా - ఈషా రెబ్బా తాజా వార్తలు

హార్లీ డేవిడ్​సన్ బైక్​పై చక్కర్లు కొడుతోంది టాలీవుడ్ నటి ఈషా రెబ్బా. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ఈషా
ఈషా

By

Published : May 16, 2020, 11:03 AM IST

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ ఎక్కేసి చక్కర్లు కొట్టేస్తోంది ఈషా రెబ్బా. ఎవరి సహాయం లేకుండా ఏమాత్రం భయం లేకుండా దూసుకెళ్తోంది. అయితే ఇదంతా ఇప్పుడు జరిగింది కాదండోయ్‌! ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన 'అరవింద సమేత' చిత్రంలో ఈషా నటించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఇలా బైక్‌ నడుపుతూ సందడి చేసింది.

తాజాగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది ఈషా. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె సాహసాన్ని మెచ్చుకుంటూ ఫిదా అవుతున్నారు. 'అంతకు ముందు ఆ తరువాత' చిత్రంతో నాయికగా పరిచయమైన ఈషా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details