తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెర అద్భుతం 'ఈగ'కు ఏడేళ్లు - sudeep

రాజమౌళి దర్శకత్వంలో 2012 జులై 6న వచ్చిన  'ఈగ' టాలీవుడ్​లో ఓ విభిన్న చిత్రంగా నిలిచింది. నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

వెండితెర అద్భుతం 'ఈగ'కు ఏడేళ్లు

By

Published : Jul 6, 2019, 4:07 PM IST

సమంత-నాని జంటగా నటించిన 'ఈగ' సినిమా.. నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. విలన్​గా నటించిన సుదీప్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కీరవాణి సంగీతమందించారు.

అప్పటి వరకు 11 చిత్రాలు తీసిన రాజమౌళి.. తొలిసారిగా కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో లేకుండా.. 'ఈగ' తో సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

ఈగ

ఈ చిత్రం నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. ఆ ఏడాది ఉత్తమ చిత్రం, దర్శకుడు, హీరోయిన్, సహాయ నటుడు విభాగాలలో అవార్డులు సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో రిలీజైన 'ఈగ'.. మొదటి రోజే రూ.17 కోట్లు వసూలు చేసింది. రూ.35 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం భారత్​లో రూ.103 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.128 కోట్లు వసూలు చేసింది. హిందీలో 'మక్కీ', తమిళంలో 'నాన్-ఈ' గా విడుదలైందీ చిత్రం.

ఇది చదవండి: ఇదో కాల్పనిక చిత్రం: రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details