తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్​.. కానీ! - viswak sen

'ఈ నగరానికి ఏమైంది' సినిమా సీక్వెల్​ను వెబ్​సిరీస్​గా తెరకెక్కించనున్నారని సమాచారం. చిత్రంలో నటించిన విశ్వక్​సేన్​ బృందమే ఇందులోనూ కనిపించనున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్​ ప్రారంభం కానుంది.

ఈ నగరానికి ఏమైంది సినిమా పోస్టర్

By

Published : Oct 28, 2019, 6:49 PM IST

Updated : Oct 28, 2019, 7:26 PM IST

'బాహుబలి' సిరీస్​తో దర్శకుడు రాజమౌళి ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ సినిమాలకు దక్కిన ఆదరణ చూశాక.. జక్కన్న వీటికి సీక్వెల్‌ తీసుకొస్తాడని భావించారు. అలాంటి ప్రయత్నమైతే చేయలేదు. కానీ 'బాహుబలి'కి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్‌ చేశారు చిత్ర నిర్మాతలు. ఇదే తరహాలో 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం సీక్వెల్..​ వెబ్​సిరీస్​గా రానుంది.

'పెళ్లిచూపులు' వంటి హిట్‌ తర్వాత కొత్తవాళ్లతో తరుణ్‌ భాస్కర్‌.. 'ఈ నగరానికి ఏమైంది' అనే వైవిధ్యభరిత చిత్రాన్ని తీశాడు. దీనికి కొనసాగింపుగా రాబోతున్న ఈ వెబ్​సిరీస్​లో.. మాతృకలో కనిపించిన విశ్వక్‌ సేన్‌ బృందమే నటించనుందట. అయితే తరుణ్‌ దర్శకత్వం వహించడం లేదు. కథ, మాటలు మాత్రమే అందించబోతున్నాడు. తరుణ్‌ స్నేహితుడు ఆదిత్య దర్శకుడిగా మారనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

ఇది చదవండి: 'పెళ్లిచూపులు' భామతో శర్వానంద్ రొమాన్స్

Last Updated : Oct 28, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details