మనీ లాండరింగ్ కేసులో నటి యామీ గౌతమ్(Yami Gautam)కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం(FEMA)) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడం వల్ల దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. ఈమేరకు జులై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్ ఇప్పటికే రెండు సార్లు ఈడీ నుంచి సమన్లు అందుకుంది.
నటి యామీ గౌతమ్‌కు ఈడీ సమన్లు - ఈడీ ముందుకు యామీ గౌతమ్
నటి యామీ గౌతమ్(Yami Gautam)కు సమన్లు జారీ చేసింది ఈడీ. విదేశీ మారక నిర్వహణ చట్టం(FEMA)) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడం వల్ల దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది.
![నటి యామీ గౌతమ్‌కు ఈడీ సమన్లు Yami Gautam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12332521-59-12332521-1625215822467.jpg)
యామీ గౌతమ్
'ఉల్లాస ఉత్సాహ' కన్నడ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్ పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 'విక్కీ డోనర్', 'యాక్షన్ జాక్సన్', 'బద్లాపూర్', 'ఉరి', 'బాలా' చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల ఆమె 'ఉరి' చిత్ర దర్శకుడు ఆదిత్యతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.