తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నరేంద్ర మోదీ' చిత్ర నిర్మాతలకు నోటీసులు - నోటీసులు

'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ' బయోపిక్​ నిర్మాతలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సినిమా విడుదల వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్లపై స్పందించాలని ఆదేశించింది. ఈ చిత్రంపై ప్రకటనలను ప్రచురించిన రెండు వార్తాపత్రికలకూ నోటీసులు పంపింది.

'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ' చిత్ర నిర్మాతలకు నోటీసులు

By

Published : Mar 27, 2019, 1:17 PM IST

Updated : Mar 27, 2019, 1:41 PM IST

'నరేంద్ర మోదీ' చిత్ర నిర్మాతలకు నోటీసులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్​ విడుదలపై సందిగ్ధం నెలకొంది. లోక్​సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదలను వాయిదా వేయాలన్న ప్రతిక్షాల డిమాండ్లపై స్పందించాలని భారత ఎన్నికల సంఘం చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.

ఏప్రిల్​ 5న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం.

మోదీ బయోపిక్​ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని, భాజపాకు ప్రచార ప్రకటనగా మారనుందని ఈసీకి ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు. లోక్​సభ ఎన్నికలు ముగిసే వరకు విడుదలను వాయిదా వేయాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చూడండీ:"వారు లేనిదే ఇంతదూరం వచ్చేవాడిని కాదు"

Last Updated : Mar 27, 2019, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details