తాను చేసి ప్రతి సినిమా ఒక్కో సవాలులాంటిదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఇటీవలే 'గులాబో సితాబో'లో విభిన్న పాత్ర పోషించారు. సినిమా విడుదల సందర్భంగా పలు విశేషాలు పంచుకుని.. షూటింగ్లో ఎదురైన సవాళ్లు గురించి వెల్లడించారు.
"ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు గంటల సమయం మేకప్‌కు కేటాయించాలి. ఇందులో మీర్జా అనే వృద్ధుడు పాత్ర పోషించాను. వేసవిలో ఇలా పనిచేయడం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ వృత్తిని అమితంగా ఇష్టపడితే.. ఈ బాధలోనూ ఆనందం వెతుక్కోవచ్చు"