తన పాటలతో మాయ చేసే సిద్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో సినీ ప్రియులను మెప్పించాడు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. మాళవిక నాయర్ కథానాయిక. హెబ్బాపటేల్ కీలకపాత్రలో కనిపించనుంది.
ఆకట్టుకుంటోన్న 'ఈ మాయ పేరేమిటో' సాంగ్ - ఈ మాయ పేరేమిటో సాంగ్
రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. ఈ చిత్రం అక్టోబర్ 2న 'ఆహా' ప్లాట్‌ఫామ్ వేదికగా విడుదలవనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'ఈ మాయ పేరేమిటో' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.
ఆకట్టుకుంటోన్న 'ఈ మాయ పేరేమిటో' సాంగ్
విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న 'ఆహా'లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి 'ఈ మాయ పేరేమిటో' అనే పాటను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.