తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎవర్​గ్రీన్ క్లాసిక్ 'ఈ మనసే' మరోసారి..

ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'మిస్​ మ్యాచ్'​. ఈ సినిమాలో 'తొలిప్రేమ'లోని ఈ మనసే పాటను రీమేడ్ చేశారు. తాజాగా ఈ సాంగ్​ను పవర్​స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశాడు.

E manase
పవన్ కల్యాణ్

By

Published : Dec 1, 2019, 11:17 AM IST

Updated : Dec 1, 2019, 3:14 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సినిమాల్లో 'తొలిప్రేమ' క్లాసిక్​గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో 'ఈ మనసే' అనే పాట ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతోంది. ఎన్ని ప్రేమ గీతాలొచ్చిన ఈ సాంగ్​కు ఉండే ఆదరణే వేరు. ఇప్పుడు ఇదే పాటను 'మిస్​ మ్యాచ్​' చిత్రంలో రీమేడ్ చేశారు. తాజాగా ఈ పాటను పవర్​స్టార్ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం.​

ఈ చిత్రంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. గిఫ్టన్ ఎలియస్ సంగీతమందించాడు. శ్రీరామ్ రాజ్, భరత్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇవీ చూడండి.. ట్రైలర్: ఇష్టమైన వ్యక్తి దూరమైతే పడే 'మథనం'

Last Updated : Dec 1, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details