తన తొలి పాన్ ఇండియా చిత్రం 'లైగర్' విడుదలకు ముందే విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ తారలు సైతం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని(Daboo Ratnani) క్యాలెండర్‌లో విజయ్ చోటు సంపాదించాడు. సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే 'డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్'లో విజయ్ మెరవబోతున్నాడు.
విజయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎంతో సమయస్ఫూర్తి కలిగిన నటుడు విజయ్ అంటూ రౌడీ హీరోపై డబూ ప్రశంసలు కురిపించారు. క్యాలెండర్ షూట్‌లో భాగంగా కండలు తిరిగిన దేహంతో బైక్‌పై కూర్చొని మాస్ లుక్‌లో విజయ్ ఫొటోలకు పోజులిచ్చాడు. ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశాడు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు విషయాలు పంచుకున్నారు.
డబ్బూ రత్నానితో విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "నేను నటుడిని కావాలనుకోవడానికి ముందు నుంచే నాకు డబూ రత్నాని క్యాలెండర్ గురించి తెలుసు. ఈ క్యాలెండర్‌ను ప్రారంభించినప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. షారుక్‌ఖాన్(Sharukh khan) ఎక్కువగా ఈ క్యాలెండర్‌లో రావడాన్ని నేను చూస్తుండేవాడిని. అలా షారుక్‌ను ఆరాధించేవాడిని. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నేను కూడా ఆయనలా ఏదో ఒకరోజు క్యాలెండర్‌లో కనిపించాలనుకున్నాను. ఇప్పుడు ఆ పని పూర్తి చేశానని భావిస్తున్నాను. ఈ ఫొటోషూట్ చిటికెలో అయిపోయింది. రత్నానితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" అని విజయ్ అన్నాడు.
'అర్జున్‌రెడ్డి'తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించిన విజయ్ ఇప్పుడు తన తొలి పాన్ ఇండియా చిత్రంతో నేరుగా బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. 'లైగర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన అనన్యపాండే సందడి చేయనుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై కరణ్ జోహార్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, యష్ జోహార్, పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. మణిశర్మ, తనిష్క్ సంగీతం అందిస్తున్నారు. 2021 సెప్టెంబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
ఇదీ చూడండి: Viral: సన్నీకిరాక్ లుక్.. స్టైలిష్‌గా రౌడీ హీరో