విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని ప్రచారం చేసుకుని, తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్న తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల నిర్మాణ సంస్థ పేరు బయటకు వచ్చినట్లు తెలిపింది. వెంటనే వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.
హీరో విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ క్షమాపణలు - production house apology to vijay devarakonda
విజయ్ దేవరకొండ పేరు చెప్పి తప్పుడు ఆడిషన్స్ నిర్వహించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ క్షమాపణలు చెప్పింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొంది.
డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరు చెప్పి, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లను సంప్రదించారు. విజయ్ తమ సినిమాకు సంతకం చేశారని, మీరు కూడా ఒప్పుకోవాలని సదరు కథానాయికలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు వారు విజయ్ బృందాన్ని సంప్రదించగా.. అలాంటిదేమీ లేదనే సమాధానం వచ్చింది.
"విజయ్ తన సినిమా అప్‌డేట్స్ అధికారికంగా ప్రకటిస్తారు. సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారు. సదరు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటాం" అని ఇటీవల విజయ్ టీమ్ ప్రకటన విడుదల చేసింది. స్పందించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ తప్పు తెలుసుకుని, విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తప్పుడు ఆడిషన్స్‌కు సంబంధించిన ప్రకటనకు కారణమైన పలువురి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.