తన అద్భుతమైన బాణీలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. అంతేకాదు ఆయనలో ఓ మంచి గాయకుడు ఉన్నాడు. ఇప్పటికే అనేక సినిమాల్లో తన గానంతో ఆకట్టుకున్నారు. జూన్ 21 న ప్రపంచ సంగీత దినోత్సవం, ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
"మ్యూజిక్ జీవితం.. అందుకే గుండె కొట్టుకుంటోంది. అందరికీ ప్రపంచ మ్యూజిక్ డే, ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సంగీతం ప్రతిచోటా నిండి ఉంది. మా హృదయాల్ని, సోల్‌ను పెట్టి.. చేసిన ప్రదర్శన ఈ ప్రదర్శనను చేశాము. మీరూ విని ఎంజాయ్ చేయండి. నా తండ్రి, నా గురువుకు దీన్ని అంకితం ఇస్తున్నా"