కర్ణాటక చిత్ర పరిశ్రమలో డ్రగ్ రాకెట్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. శుక్రవారం నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు 12 మంది నిందుతుల పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫిలిం స్టార్లు, ఇతర వీఐపీల కోసం పార్టీల సమయంలో మాదక ద్రవ్యాలు అమ్మడం వీరు చేసే వృత్తిగా పోలీసులు తెలిపారు. సమాజ శ్రేయస్సుకు భంగం వాటిల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు.
నిందితుల పేర్లు ఇవే..
ఏ1: శివ ప్రకాశ్, చిప్పి
ఏ2: రాగిణి ద్వివేది
ఏ3: విరేన్ ఖన్నా
ఏ4: ప్రశాంత్ రంక
ఏ5: వైభవ్ జైన్