తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసులో దీపిక మేనేజర్​కు తాత్కాలిక ఊరట - కరిష్మా ప్రకాష్​ వార్తలు

సుశాంత్​ మృతికి సంబంధించిన డ్రగ్స్​ కేసులో నటి దీపిక పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ అభియోగాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆమె నివాసంలో మాదకద్రవ్యాలు పట్టుబడిన క్రమంలో ముందస్తు బెయిల్​ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా.. అందులో తాత్కాలిక ఊరట లభించింది.

Drug case: Deepika's manager Karishma Prakash gets relief from arrest till Nov 7
డ్రగ్స్​ కేసులో దీపిక మేనేజర్​కు ఉపశమనం

By

Published : Nov 3, 2020, 6:16 PM IST

డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు ఎన్​డీపీఎస్​ కోర్టులో ఊరట లభించింది. నవంబరు 7 వరకు న్యాయస్థానం ఆమెకు ఉపశమనం కల్పించింది.

ఈ కేసులో కరిష్మా ప్రకాశ్​ ముందస్తు బెయిల్​ దరఖాస్తుకు ప్రతిస్పందనగా నవంబరు 7 వరకు అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, విచారణకు హాజరు కావాలని నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో తెలిపింది. దర్యాప్తునకు కరిష్మా సహకరిస్తుందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

సుశాంత్​ మరణానికి సంబంధించిన డ్రగ్స్​ కేసులో కరిష్మా ప్రకాశ్​ అభియోగాలు ఎదుర్కొంటోంది. అక్టోబరు 27న ఎన్​సీబీ ఎదుట ఆమెను మరోసారి హాజరుకావాలని కోరినప్పటికీ.. విచారణకు రాలేదు. దీంతో ఆమె తల్లితో పాటు క్వాన్​ టాలెంట్​ ఏజెన్సీ యజమానులకు నవంబరు 2న సమన్లు జారీ చేసినట్లు ఎన్​సీబీ వర్గాలు తెలిపాయి.

మాదకద్రవ్యాల పట్టివేత

అక్టోబర్​ 27న కరిష్మా ఇంట్లో సోదాలు నిర్వహించి, మాద్రక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఎన్సీబీ. తక్షణమే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉండటం వల్ల మరోసారి కరిష్మాకు సమన్లు జారీ చేసింది. దీంతో కరిష్మ.. శనివారం ఎన్​డీపీఎస్​ కోర్టులో ముందస్తు పిటిషన్​ దాఖలు చేసింది.

ABOUT THE AUTHOR

...view details