బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ పరిస్థితి విషమం - director Nishikant Kamat critical
12:04 August 17
కాలేయ సమస్యతో బాధపడుతున్న నిషికాంత్
కాలేయ సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ పరిస్థితి విషమంగా మారింది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈయన చికిత్స పొందుతున్నారు.
అజయ్ దేవగన్, శ్రియ నటించిన 'దృశ్యం', ఇర్ఫాన్ ఖాన్ 'మదారి', జాన్ అబ్రహం 'ఫోర్స్', 'రాకీ హ్యాండ్సమ్' లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు కామత్. ఈయన తీసిన 'డొంబివాలి ఫాస్ట్',' లై భారీ' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరాఠీలోనూ ఈయన చాలా చిత్రాలు తెరకెక్కించడం సహా నటుడిగానూ మెప్పించారు