మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేశ్, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవలే ప్రారంభించగా.. సినిమాలో వెంకటేశ్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం ఈ మధ్యే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ రీమేక్‌ను కరోనా ఉద్ధృతి కారణంగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మే లేదా జూన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా దీనిపై స్పందించిన ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు.. ఇవ్వన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. సినిమా మొదటగా థియేటర్లోనే విడుదలవుతుందని, ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.