ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేశ్ నటించిన 'దృశ్యం 2'(Drishyam 2 release date) సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబరు 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. దీంతో పాటు టీజర్‌ను రిలీజ్ చేసింది. థియేటర్లను వదిలి ఓటీటీకి వస్తున్న వెంకటేశ్ రెండో సినిమా ఇది. ఇంతకుముందు 'నారప్ప'ను కూడా నేరుగా ప్రైమ్‌లోనే విడుదల చేశారు.
'దృశ్యం' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు దర్శకుడు జీతూ జోసెఫ్. మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2'(Drishyam 2 release date) తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కింది. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా మీనా నటించారు.