తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి బరిలో రాజశేఖర్ సినిమా.. కుదురుతుందా?

పలు భారీ బడ్జెట్​ సినిమాలతో సంక్రాంతి రేసు రంజుగా ఉంది. అయితే తన సినిమాను అదే సమయానికి రిలీజ్ చేయాలని రాజశేఖర్ భావిస్తున్నారట. ఇంతకీ అది కుదురుతుందా?

Rajasekhar
రాజశేఖర్

By

Published : Nov 3, 2021, 5:31 AM IST

సీనియర్ హీరో రాజశేఖర్​ సాహసం చేయబోతున్నారా? ఆయన కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'శేఖర్'. దీనిని సంక్రాంతి బరిలో నిలపాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా ఈ సినిమాకు ఉందని, అందుకే పండగకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్​ సినిమాలైన ఆర్ఆర్ఆర్(జనవరి 7), భీమ్లా నాయక్(జనవరి 12), సర్కారు వారి పాట(జనవరి 13), రాధేశ్యామ్(జనవరి 14) ఉన్నాయి. ఒకవేళ రాజశేఖర్ 'శేఖర్​' సినిమా పండగకు థియేటర్లలోకి వస్తే.. వీటిని తట్టుకుని నిలబడగలదా అనే సందేహం వస్తోంది. దీని గురించి క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

శేఖర్ మూవీ పోస్టర్

'శేఖర్' షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇందులో రిటైర్డ్ పోలీస్ అధికారిగా రాజశేఖర్ కనిపించనున్నారు. మలయాళ సినిమా 'జోసెఫ్'కు ఇది రీమేక్! అను సితార, మస్కన్ కథానాయికలు. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details