తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ నటుడు మోహన్​బాబు ఇంట విషాదం - మోహన్​బాబు

ప్రముఖ సీనియర్​ నటుడు మోహన్​బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి(63) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

mohanbau
మోహన్​బాబు

By

Published : Nov 17, 2021, 7:09 PM IST

Updated : Nov 17, 2021, 8:14 PM IST

ప్రముఖ సీనియర్​ నటుడు మోహన్​బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మోహన్​బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, రంగస్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మోహన్​బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.

రంగస్వామి

ఇదీ చూడండి: కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Last Updated : Nov 17, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details