హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్.. తన తదుపరి సినిమా కోసం అంతరిక్షంలో సాహసాలు చేయనున్నాడని తెలియగానే సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. ప్రముఖ దర్శకుడు డగ్ లిమాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని స్పష్టత వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అమెరికన్ మేడ్', 'ఎడ్జ్ ఆఫ్ టుమారో' సినిమాలు వచ్చి ఘనవిజయం సాధించాయి
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్, అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగానే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.