తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒమిక్రాన్ భయం.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్​ కష్టమేనా? - radhe shyam movie release

sankranti 2022 movies: ఓ వైపు సంక్రాంతికి భారీ బడ్జెట్ తెలుగు​ సినిమాలు ముస్తాబవుతుంటే.. నేనోచ్చేశా అంటూ కరోనా కొత్త వేరియెంట్​ రావడం పలు సందేహాలకు తావిస్తోంది. చిత్రాలు రిలీజ్ అవుతాయా లేదా అనే సందేహం అభిమానులు, దర్శక నిర్మాతల్లో రేకెత్తిస్తున్నాయి.

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

By

Published : Dec 2, 2021, 2:51 PM IST

sankranti 2022: సంక్రాంతికి రాబోయే తెలుగు సినిమాలు ఏవేవో దాదాపు ఖరారైపోయింది. వీటిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు ఉన్నాయి.

అయితే అనుకోని అవాంతరంలా కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చిపడింది. రోజురోజుకూ కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో చాలా దేశాలు ఆ కేసుల్ని డీల్​ చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. మన దేశం కూడా ఈ వేరియెంట్​ను అడ్డుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది.

భీమ్లా నాయక్ మూవీ

అయితే ఈ వేరియెంట్​ ప్రభావం రాబోయే రెండు నెలల పాటు ఉండొచ్చని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం.. త్వరలో విడుదలయ్యే చిత్రాలతో పాటు సంక్రాంతికి వచ్చే తెలుగు సినిమాలపై కచ్చితంగా పడుతుంది.

ఈ క్రమంలో ఆయా సినిమాల దర్శకనిర్మాతలు అప్పుడే తన సినిమాలకు ప్రత్యామ్నాయ విడుదల తేదీలపై ఆలోచన చేస్తున్నారట. ఒకవేళ వైరస్​ ప్రభావం ఎక్కువై థియేటర్లు మూసివేస్తే కొత్త తేదీల్లో వస్తాయి. లేకపోతే ముందే చెప్పిన తేదీలకు రిలీజ్ అవుతాయి!

మరోవైపు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అని. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానమే చెప్పాలి!

రాధేశ్యామ్ మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details