'ఇస్మార్ట్ శంకర్'తో మాస్హిట్ కొట్టాలన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు హీరో రామ్. ఈ చాక్లెట్ బాయ్ తర్వాతి సినిమా ఎలా ఉంటుందా అని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంచనాలకు తగ్గట్టుగానే మరో కొత్త కథ, పాత్రతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలని రామ్ సన్నద్ధమవుతున్నాడు.
తమిళ హిట్ 'తడం' రీమేక్ ఎనర్జిటిక్ స్టార్ తదుపరి సినిమా అని సినీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఈ సినిమాతో కెరీర్లో తొలిసారి ద్విపాత్రానభినయంలో కనిపించనున్నాడీ హీరో. రెండు పాత్రలూ పూర్తి భిన్నంగా ఉంటాయని టాక్. రామ్ అభిమానులు మాత్రం ఈ వార్త విని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు రామ్ డ్యుయల్ రోల్ చేయలేదు.