'ఢీ'.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్ కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా 'డబుల్ డోస్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.
'ఢీ' సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ.. త్వరలో షూటింగ్ షురూ - ఢీ సీక్వెల్ షూటింగ్
మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చి హిట్ అందుకున్న చిత్రం 'ఢీ'. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీను.
త్వరలోనే పట్టాలెక్కనున్న 'ఢీ' సీక్వెల్
ఇప్పటికే ఈ సినిమా కోసం విష్ణు కసరత్తులు మొదలుపెట్టాడు. తను చెమటోడుస్తున్న ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ దర్శకుడు శ్రీను వైట్ల ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. "సినిమాలో పాత్ర కోసం మీరు పడుతున్న కష్టం గొప్పది. మేము కూడా స్క్రిప్ట్ కోసం అంతే స్థాయిలో శ్రమిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ మొదలెడదాం." అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు.