తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మై డియర్‌ డార్లింగ్‌.. ఎందుకంత ఫైరింగ్‌ - jareen khan

టాలీవుడ్ నటుడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'చాణక్య'. ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

చాణక్య

By

Published : Sep 14, 2019, 6:31 PM IST

Updated : Sep 30, 2019, 2:43 PM IST

గోపీచంద్‌ కథానాయకుడిగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'చాణక్య'. బాలీవుడ్‌ కథానాయిక జరీన్‌ ఖాన్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. మరో హీరోయిన్​గా మెహరీన్‌ నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'డార్లింగ్‌ మై డియర్‌ డార్లింగ్‌.. ఎందుకంత ఫైరింగ్‌' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తుంది. గోపీచంద్‌, మెహరీన్‌ మధ్య మాటలు లేనపుడు వచ్చే గీతంగా అనిపిస్తుంది. సాహిత్యం గమనిస్తే.. సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్‌ స్వరాలు సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. హరిణి ఆలపించింది.

ఇవీ చూడండి.. "మీరూ ఇలా ప్రయత్నించండి" అంటున్న సుధీర్ బాబు

Last Updated : Sep 30, 2019, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details