విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమాలోని "కళ్లలో కలవరమై" వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది.
"ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా.. ఊహలే ఎన్నో కొంటే కథలే చెప్పగా" అంటూ సాగే ఈ ప్రేమ గీతం ఆకట్టుకుంటోంది. "ఊరించే ఊసులు ఎన్నో.. ఉడికిస్తూ చంపుతుంటే.. ఆ తపనలోన తనువు తుళ్లి పడుతుంటే" అంటూ ముగుస్తుంది వీడియో సాంగ్.