తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓ దొరసాని... కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే - శివాత్మిక

టాలీవుడ్​ నటుడు విజయ్​ దేవరకొండ సోదరుడు ఆనంద్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమా ప్రీ లుక్​ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.

ఓ దొరసాని... కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే

By

Published : May 25, 2019, 2:11 PM IST

Updated : May 25, 2019, 4:22 PM IST

విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ ఇమేజ్‌తో వెండితెరపైకి దూసుకొస్తున్నాడు అతడి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. ఈ చిత్రంతోనే హీరో రాజశేఖర్‌ రెండవ కుమార్తె శివాత్మిక వెండితెరపై అరంగేట్రం చేయనుంది. కె.వి మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘దొరసాని’ పేరుతో ప్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

దొరసాని సినిమా ప్రీ లుక్

ఈ పోస్టర్‌లో నాయకానాయికలిద్దరూ ఒకరి చేతులొకరు అందుకున్నట్లుగా చూపించారు. హీరోయిన్‌ చేతి వేలికి ఖరీదైన పెద్ద ఉంగరం ఉండగా.. హీరో చేతిపై మాత్రం తెల్లటి పెయింట్ మరకలున్నాయి. బ్యాక్​గ్రౌండ్‌లో ఓ కాగితంపై ప్రేమ కవిత రాసి ఉంది. " కథవు నువ్వే.. కథనం నువ్వే.. నా మదిని తాకే అలవు నువ్వే.. కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే.." అంటూ అస్పష్టంగా ఆ కవిత కనిపిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 30న విడుదల చేయబోతుందని తెలిపింది చిత్ర బృందం. మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం.. జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి--> బ్రేక్అప్ అంటున్న విజయ్ దేవరకొండ..?

Last Updated : May 25, 2019, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details