హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'దొరసాని'. హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి రేపిన చిత్రబృందం నేడు టీజర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది.
'దేవకి కాదు... మీరు నా దొరసాని' - sivathmika
పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన 'దొరసాని' సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
!['దేవకి కాదు... మీరు నా దొరసాని'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3483736-thumbnail-3x2-dorasaani-teaser.jpg)
'దేవకి కాదు... మీరు నా దొరసాని'
1980ల నాటి తెలంగాణలోని ఓ గ్రామంలో సాధారణ యువకుడు రాజు, ఎగువ తరగతి అమ్మాయి దేవకిల మధ్య ప్రేమాయణమే ఈ చిత్ర కథ. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా ఉండనుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాను నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. యశ్.రంగినేని, మధుర శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరించారు. జులై 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: బాలీవుడ్ ఓ మై బేబీగా శ్రద్ధాకపూర్..!