తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దొరసాని... ఓ సారి ఇటు చూడవా...! - దొరసాని సినిమా ఫస్ట్​లుక్

తెలుగుతెరకు పరిచయమవుతున్న ఆనంద్ దేవరకొండ, శివాత్మిక.. హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'దొరసాని' సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. జూన్​ 6న టీజర్ విడుదల కానుంది.

దొరసాని ఓ సారి ఇటు చూడవా...!

By

Published : May 30, 2019, 4:17 PM IST

టాలీవుడ్​ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమాతోనే రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక అరంగేట్రం చేస్తోంది. నూతన దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఆనంద్‌ - శివాత్మిక జోడి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. కథానాయిక దొరసానిలా కారులో దర్జాగా వెళ్తుంటే.. ఆమె చూపుల్లో పడాలనే తపనతో సైకిల్‌పై అనుసరిస్తూ ఆనంద్‌ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. 1980ల కాలం నాటి తెలంగాణ బ్యాక్​డ్రాప్​తో సాగే ఓ సరికొత్త ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది.

దొరసాని సినిమా ఫస్ట్​లుక్

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్‌ 6న టీజర్‌ను విడుదల చేయనున్నారు. మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details