తాను దర్శకత్వం వహించిన రెండు సినిమాలను ప్రస్తుతం ఎవరూ వీక్షించవద్దని దర్శకుడు గౌతమ్ మేనన్ అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చే నెల మూడో తేదీ వరకూ లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు పలు సినిమాలు, షోలు చూడడం సహా కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులూ పలు వీడియోలను రూపొందించి సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ కరోనా వైరస్ నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకున్నారు.
ఆ రెండు సినిమాలు చూడకండి: గౌతమ్ - సాహసం శ్వాసగా సాగిపో సినిమా
తన దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలను చూడొద్దని ప్రజలకు సూచించారు ప్రముఖ దర్శకుడు గౌతమ్మేనన్. ఆ చిత్రాలను చూస్తే విహారయాత్రకు వెళ్లాలనే ఆలోచన కలుగుతుందన్నారు. కరోనా కట్టడి కోసం కొనసాగుతున్న లాక్డౌన్లో ఇలాంటి సినిమాలు చూసి బయటకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన 'ఎంతవాడు గాని..', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలను ప్రస్తుతం ఎవరూ వీక్షించవద్దని ఆయన కోరారు. 'ఎంతవాడు గాని..' చిత్రంలో అజిత్ తన కుమార్తెతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలకు టూర్ వెళ్తాడు. అలాగే 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నాగచైతన్య తన ప్రేయసితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలకు లాంగ్ టూర్ వెళ్తాడు. దీంతో ఇప్పుడు ఆ రెండు సినిమాలను ఎవరైనా చూస్తే బయటకు వెళ్లాలనే ఆలోచన కలుగుతుందని.. ఈ పరిస్థితుల్లో అది అంత సురక్షితం కాదని.. కాబట్టి ఎవరూ ఆ రెండు సినిమాలను చూడవద్దని ఆయన సూచించారు.
ఇదీ చూడండి.. పవన్ ఎంత చెప్పినా జగన్ వినలేదు!