తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ కేసును రాజకీయం చేయొద్దు'

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసును రాజకీయం చేయొద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే కోరారు. విచారణ సమయంలో ముంబయి పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఠాక్రే స్పందించారు.

Don't use Sushant Singh Rajput's case to create friction between Maharashtra, Bihar: Uddhav Thackeray
ఉద్ధవ్​ ఠాక్రె

By

Published : Aug 1, 2020, 11:21 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసును మహారాష్ట్ర, బిహార్​ రాష్ట్రాల మధ్య రాజకీయం చేసి.. ఘర్షణలను సృష్టించొద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. విచారణ సమయంలో ముంబయి పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఠాక్రే స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయి పోలీసులు అసమర్థులు కాదని.. ఈ కేసుకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే.. ముందుకు రావాలని కోరారు.

"ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే నిర్భయంగా మా వద్దకు రండి. అందులో వాస్తవాలుంటే దోషులని విచారించి శిక్షిస్తాం. దయచేసి, మహారాష్ట్ర, బిహార్​ మధ్య ఘర్షణను సృష్టించేందుకు ఈ కేసును సాకుగా ఉపయోగించొద్దు. ఇందులో రాజకీయాలను తీసుకురావడం చాలా దురదృష్టకరం."

-ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవిట్​ దాఖలు చేసింది. ఇటీవలే పట్నాలో నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ.. సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, దీనిని సవాలు చేస్తూ.. బిహార్​ ప్రభుత్వ, రాజ్​పుత్​ కుటుంబం కోర్టులో కేవిట్​ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే రియా చక్రవర్తి కేసులో మహారాష్ట్ర వైపు వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కోర్టును కోరినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details